కరోనా కట్టడి కోసం నిద్రాహారాలు మానేసి పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులకి బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలు అనిర్వచనీయం అని అన్నారు. ‘మహారాష్ట్ర పోలీసు, డాక్టర్లు, పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, మహారాష్ట్ర పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందితో పాటు దేశ వ్యాప్తంగా అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు.. అని ఆమీర్ ఖాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కరోనాని నిర్మూలించేందుక భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటంకి గాను తన వంతు సాయంగా విరాళం అందించనున్నట్టు ఇటీవల పేర్కొన్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్ధిక సాయం చేస్తానని అన్నారు. ఎంత మొత్తం అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే తాను నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ చద్దా’ కోసం పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు కూడా ఆమీర్ అండగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.