ఆమె ఏం తింటారు? అవోకాడో (వెన్న పండు) పండు తింటారా? : చిదంబరం

ఆమె ఏం తింటారు? అవోకాడో (వెన్న పండు) పండు తింటారా? : చిదంబరం


* ఉల్లి తిననన్న నిర్మలా సీతారామన్‌ కు చిదంబరం చురకలు
* కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై విపక్ష సభ్యుల విమర్శలు
* ఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపి ల నిరసన.. నిరసనలో పాల్గన్న చిదంబరం

ఢిల్లీ: తమ ఇంట్లో ఉల్లిపాయలను అంతగా వాడబోమని, తాను ఉల్లిపాయలు పెద్దగా వాడని కుటుంబం నుంచి వచ్చానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం స్పందించారు. గురువారం చిదంబరం రాజ్యసభ సమావేశాల్లో పాల్గనడానికి పార్లమెంటుకు రాగా, రాజ్యసభ వాయిదా పడిన నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణంలో చిదంబరం మీడియాతో మాట్లాడుతూ... ఉల్లి ధరలపై నిర్మలా సీతారామన్‌ నిన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
' తాను ఉల్లిపాయలు తినబోనని నిన్న ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. మరి ఆమె ఏం తింటారు? అవోకాడో (వెన్న పండు) పండు తింటారా?' అని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, ఉల్లిధరలు పెరిగిపోవడంతో సామాన్యులు పడుతోన్న ఇబ్బందులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కు తెలియడం లేదని ఈ రోజు కూడా విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. ఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపి లు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో చిదంబరం కూడా పాల్గన్నారు.